మన ప్రగతి న్యూస్/ నల్గొండ/మిర్యాలగూడ
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు మిర్యాలగూడలో పోలీసులు శుక్రవారం రాత్రి ప్రత్యేక నార్కోటిక్స్ డాగ్ స్నైపర్ తో తనిఖీలు నిర్వహించారు. మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు సూచన మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక జాగిలంలో తనిఖీలు నిర్వహించారు. కొన్ని అనుమానస్పద ప్రాంతాలు లాడ్జి, బస్టాండు, వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగార్జున ఎస్సై సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.