కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి అజీజ్
మన ప్రగతి న్యూస్/హత్నూర:
పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయమే జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు యం.డి అజీజ్ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ లో శనివారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, నవోదయ, సైనిక్ స్కూల్స్ ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉన్నప్పటికీ పార్లమెంట్ బడ్జెట్లో సమావేశాల్లో వాటి ప్రస్తావనే లేవనెత్తకపోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ నుంచి 8 మంది, ఎంపీలున్నా రాష్ట్రా బడ్జెట్ విషయంలో ఒక మాట అయినా మాట్లాడకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
త్వరలో ఎన్నికలు జరిగే బిహార్ రాష్ట్రానికి మాత్రం వరాలు జల్లు ప్రకటించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆయన అన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే ఆ రాష్ట్రాలలో ఓట్లు అర్జించుకోవడం కోసం నిధులు ప్రకటించడం దుర్మార్గమైన చర్యని ఆయన మండిపడ్డారు. పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది శూన్యమని అజీజ్ ఎద్దేవ చేశారు.