Breaking News

ఈ నెల 7, నచలోహైదరాబాద్విజయవంతం చేయండి మండల ఇంచార్జ్ మొగులయ్య

మన ప్రగతి న్యూస్/హత్నూర:
ఎస్సీ వర్గీకరణ అమలుకై హైదరాబాదులో జరిగే వేల గొంతుల లక్ష డప్పుల మాదిగల భారీ సంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయుటకై సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ ఆదివారం వాల్ పోస్టర్ విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, ఎం ఎస్ పి జిల్లా కార్యదర్శి గందగళ్ళ ప్రసాద్ మాదిగ హాజరై మాట్లాడుతూ ఈ మహా ప్రదర్శన ర్యాలీ ఎల్బీ స్టేడియం నుండి పెద్ద అంబేద్కర్ వరకు కొనసాగుతుందని అన్నారు. ప్రతి మాదిగ బిడ్డ సంకన డప్పు వేసుకొని వేల సంఖ్యలో బయలుదేరాలని పిలుపునిచ్చారు. ప్రపంచమే మాదిగల వైపు చూసే విధంగా మన డప్పు మన ఆట మన పాట మన సంస్కృతిని ప్రపంచానికి తెలిసే విధంగా ప్రపంచ చరిత్రలో మేము మాదిగలము అనే విధంగా మన ప్రదర్శన ఉండాలని అన్నారు. ప్రదర్శన ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనువిప్పు కలిగే విధంగా మాదిగల డప్పులు మారుమోగాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం వేల గొంతుల నినాదం ఏకమవ్వాలి అన్నారు. అప్పుడే రేవంత్ రెడ్డి సర్కార్ దిగివచ్చి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సానుకూలంగా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు ,వీరయ్య మాదిగ, చిలిపిచేడ్ మండల ఇంచార్జ్ దుర్గ దాస్ మాదిగ, ఎల్లయ్య మాదిగ, నవీన్ మాదిగ, కృష్ణ, నాగేష్, శంకర్, రవి, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం