బడా కార్పొరేట్ శక్తుల భరోసా ఇచ్చిన కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ నిరసిస్తూ బడ్జెట్ పత్రాల దహనం
మన ప్రగతి న్యూస్/నర్సంపేట:

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రజలను వంచన చేసి బడా కార్పోరేట్ శక్తులకు ఉడిగం చేసే విధంగా ఉందని, ప్రజలకు ఆసరాగా లేని బడ్జెట్ ప్రవేశపెట్టారని దాని నిరసిస్తూ నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డు కూడలి వద్ద బడ్జెట్ పత్రాలను ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్ నాయక్, సిఐటియు రాష్ట్ర నాయకురాలు కాసు మాధవి మాట్లాడుతూ
2025-26 బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదని
కేంద్ర ప్రభుత్వం పదే పదే వల్లెవేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా అని పునర్ సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు .ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదు. దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన నిర్మల సీతారామన్ , దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరం పది సంవత్సరాలనుండి ఇదే దోరణిని ప్రదర్శిస్తూ రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం⁰. 2024 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్,

2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారు 2026 యూపీ బడ్జెట్, 2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారని ప్రశ్నించారు. బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా అని విమర్శించారు .ఇది కేంద్ర బడ్జెట్ లా లేదు, కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉందని అన్నారు తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించినట్లు అని విమర్శించారు తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించింది. కేంద్ర జీడీపీకి 5.1శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ మరోసారి మోస పోయిందని ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ట్రైబల్ యూనివర్సిటీకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడం బాధాకరం తెలంగాణకు నిధులు కేటాయించక పోవడం దారుణమని అన్నారు . రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ చేసిందేం లేదు అని కేంద్రం బడ్జెట్ ద్వారా నిధులు రాబట్టుకోవడంలో బిజెపి ఎంపీలు విఫలమయ్యారని .బిజేపీ పార్టీ తీరు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని నిధుల కేటాయింపు సంగతి దేవుడెరుగు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేకపోయిందని .కేంద్రానికి మద్ధతు పలికిన జనతాదళ్ (యూ) బీహార్‌లో వివిధ అభివృద్ధి పనులకు గతేడాది రూ. 26,000 కోట్ల సాయం, 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్, గయాలో పారిశ్రామిక కారిడార్, నూతన విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలకు సాయం తదితరాలు పొందింది.ఎన్నికలు దగ్గర ఉన్నాయని ఇప్పటి బడ్జెట్ లో బిహార్ కు మరిన్ని వరాల జల్లు కురిపించారు.బిహార్ లో మఖాన బోర్డు ఏర్పాటు,మిథిలాంచల్ లో వెస్టర్న్ కోసి కెనాల్,ఐఐటీ పాట్నా విస్తరణ,బిహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు,ఫడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.8 సీట్లు ఇచ్చి బీజేపిని గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు మొండి చెయ్యి ఇచ్చారని 8 మంది బిజేపీ ఎంపీలు, రాష్ట్రానికి ప్రత్యేకంగా 8 రూపాయలు కూడా అధికంగా సాధించిన దాఖలాలు లేవు అని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల సంగతి ఏమిటి? పునర్విభజన చట్టం హామీల పరిస్థితి ఏమిటి దేశ ప్రయోజనాలు కాపాడటంలో బీజేపీ వైఫల్యం చెందిన విషయాన్ని దేశ ప్రజలు గమనించాలని అన్నారు ఈ కార్యక్రమం లో ప్రజసంఘాల నాయకులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి భూక్య సమ్మయ్య, జిల్లా నాయకులు కోరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్, పుచ్చాకాయల కృష్ణ రెడ్డి,గడ్డమీద బాల కృష్ణ, కంది కొండ రాజు, శ్రీనివాస్ రెడ్డి బుర్రి ఆంజనేయులు, పిండి రాములు నర్సింహా రెడ్డి, సుధాకర్ ఎండీ ఫరిదా, వజ్జంతి విజయ, బిట్ర స్వప్న ఇప్ప సతీష్,సారయ్య,కార్తీక్ అనిల్ విలియం,నెహ్రు మల్లయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు