మండల విద్యాధికారి తరి రాము
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
ప్రతి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలను పెంచేలా కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాల లోనే విద్యార్థులు చదువుకునేటట్లు ఉపాద్యాయులతో పాటు తల్లి దండ్రులు చొరవ చూపాలని మండల విద్యాధికారి తరి రాము అన్నారు.వివరాలలోకి వెళితే నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలను శనివారం ఆయన సందర్శించి విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని పరిశీలించి విద్యార్థులకు బోధిస్తున్న తీరును పాఠ్యాంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ శిక్షణ తీసుకున్న మంచి ఉపాధ్యాయులతో విద్యను అందించడం జరుగుతుందని ప్రతి ఒక ఉపాధ్యాయుడు అంకిత భావంతో విద్యార్థులకు బోధన చేయాలని ఉపాద్యాయులతో పాటు విద్యార్థులందరు సమయపాలన పాటించడం అవసరమని అన్నారు.పాఠశాల సమయంలోనే మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకొనే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలియజేశారు. తర్వాత విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు గణేశ్వరి తండ్రి లక్ష్మయ్య జ్ఞాపకార్థం 5000 వేల రూపాయలతో తయారు చేసిన బ్యాడ్జీలను బెల్టులను విద్యార్థులకు ఆయన అందజేయటం జరిగింది.అనంతరం పాఠశాలలో అటెండర్ గా విధులు నిర్వహిస్తూ ఇటివలే పదవీ విరమణ పొందిన నీలమ్మ ను శాలువా పూలమాలతో సన్మానించి ఆమె చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ శేషు ఉపాధ్యాయులు రమణి యాదగిరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.