Breaking News

తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కు ఘనంగా పదవి విరమణ ఆత్మీయ సత్కారం.

మన ప్రగతి న్యూస్/హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ తాజా మాజీ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ లకు హుజురాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పదవి విరమణ ఆత్మీయ సత్కారం జరిగింది.
ఈ సందర్భంగా సంఘ నేతలు గందె రాధిక శ్రీనివాస్ చేసిన పట్టణ అభివృద్ధిని మరియు వైశ్య సంఘ భవన నిర్మాణానికి మరియు సంఘ స్మశాన వాటికకు చేసిన అభివృద్ధిని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా గందె రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ నా ఎదుగుదలకు ఎంతో ముఖ్య పాత్ర పోషించిన ఆర్యవైశ్యులకు ఎప్పుడు రుణపడి ఉంటానని ఎప్పుడూ ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఉంటానని సంఘ శ్రేయస్సు కు సమాజా సంఘ శ్రేయస్సు కు సమాజాభివృద్ధికి తన వంతు కృషి ఎప్పుడు ఉంటుందని. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగిందని తెలియజేసారు.. ఈ సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్యవైశ్య సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి నూక శ్రీనివాస్ కోశాధికారి రేణిగుంట్ల సురేష్ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కోడిత్యాల నాగరాజ్ వాసవి క్లబ్ మెన్స్ అధ్యక్షులు అక్కినపల్లి శ్రవణ్ కుమార్ ఉమెన్స్ అధ్యక్షురాలు నార్ల అర్చన, ఆవోప అధ్యక్షులు శివనాధుని ఈశ్వరయ్య
సంఘనాయకులు నార్ల రాజేందర్ క్యాస ఛక్రధర్,వివేకవర్ధిని ప్రసాద్ సార్ ,క్యాస ఉపేందర్ ,పుల్లూరి శ్రీకాంత్, కోమురవెల్లి రఘువీర్ భూపతి కుమారస్వామి ,బల్లు పున్నం ,తాటిపెళ్లి రాజన్న, కేదారేశ్వర రాజన్న ,కొమురవేల్లి హరి ప్రసాద్, తది తరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం