మన ప్రగతి న్యూస్/జఫర్‌గడ్:
జనగామ జిల్లా జఫర్‌గడ్ తహసిల్దార్ కార్యాలయం రెవెన్యూ ఇన్వెస్టర్ గా పనిచేస్తున్న వూతలూరి అనిల్ బాబు నాయబ్ తాసిల్దారుగా పదోన్నతి పొందినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు జఫర్‌గడ్ నాయబ్ తహసీల్దార్ గా పనిచేస్తున్న బానోత్ ఖాసీం నాయక్ ను డిఎంసీఎస్ జనగామ బదిలీ చేశారు. ఇదే కార్యాలయంలో అర్ఐ గా పనిచేసి నాయబ్ తాసిల్దార్ గా పదోన్నతి పొందిన అనిల్ బాబును రెవేన్యూ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
