Breaking News

వేల గొంతుల లక్షలాది డప్పుల ప్రదర్శన గోడ పత్రికలను ఆవిష్కరించిన యంగల నరేష్

ఫిబ్రవరి 7న ఛలో హైదరాబాద్ కు సిద్ధం కాండి

మన ప్రగతి న్యూస్/ ఏస్కూర్

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఎస్కూర్ మండలంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు
యంగళ నరేష్ మాదిగ వేల గొంతుల లక్షలాది డప్పుల ప్రదర్శన గోడ పత్రికలను ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తక్షణ అమలు కొరకు ప్రధాన డిమాండ్తో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపులో భాగంగా లక్షలాది డప్పుల వేలాది గొంతుల గొప్ప ప్రదర్శనకు ఏన్కూర్ మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి మాదిగ బిడ్డ, ఎస్సీ ఉప కులాల బిడ్డలు, సామాజిక న్యాయానికి మద్దతునిచ్చే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక సంఘాలు భారీ వాహనాలు ఏర్పాటు చేసుకొని డప్పు దళాలతో హైదరాబాదుకు కదం తొక్కాలని పిలుపునిచ్చారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ
కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పూర్ణాకంటి మైసరావు మాదిగ,మాజీ మండల అధ్యక్షులు పూర్ణాకంటి నాగరాజు మాదిగ,బీసీ నాయకులు చింతానబోయిన సీతారాములు, అంజనకుమార్ యాదవ్,జూపాటి శ్రీనివాస్, సాయిమాదిగ,ప్రవీణ్మాదిగ , రాకేష్ మాదిగ,నాగమణిమాదిగ, తిరుమల రావు మాదిగ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.