అవగాహన కల్పించిన మున్సిపాలిటీ అధికారులు
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

నందికొండ మున్సిపాలిటీ పరిధిలో రెండు కాలనీలో పర్యావరణంలో బాగంగా పలు షాపులలో బుధవారం మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనువాస్ ఆదేశాల మేరకు పలు హోల్ సేల్ షాపులు, కిరాణా షాపుల్లో,హోటల్స్, కూరగాయల దుకాణాలు, బేకరి దుకాణాలు లలో తనిఖీ నిర్వహించి ప్లాస్టిక్ వాడుతున్న పలు దుకాణాల యజమానులకు నోటీసులు జారీ చేసి ప్లాస్టిక్ వినియోగం వలన జరిగే అనర్ధాలు గురించి తెలియచేయటం జరిగింది, ప్లాస్టిక్ కవర్లు వినియోగం వద్దు, జ్యూట్ బ్యాగులే ముద్దు, నినాదంతో ప్రజలకు అవగాహన కలపంచటం జరిగింది .ఈ సందర్భంగా మానవ ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని , క్లోరినేటెడ్ ప్లాస్టిక్ వాడకం వలన హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుందని, భూగర్భంలోని జలాలు కలుషితం అయి నీటి శాతం తగ్గుతుందని తెలియచేయటం జరిగింది .ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డ్ అధికారులు, పర్యావరణ ఇంజనీర్ పాల్గొన్నారు.
