అక్రమ ఇసుకపై మరింత దూకుడు మించిన రెవెన్యూ శాఖ
రామవరం పంచాయతీలోని కొత్తూరు గ్రామం లో ఇసుక నిలువలు గుర్తింపు
ఇసుక మాఫియా పై నిఘా పెంచుతున్న యంత్రాంగం
మన ప్రగతి న్యూస్/ములకలపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి మండల పరిధిలోని అక్రమ ఇసుక నిలవలపై మరింత దూకుడు పెంచింది రెవెన్యూ శాఖ అధికార యంత్రం మంగళవారం పట్టణ పరిధిలోని కొందరు అక్రమార్కులు వందల కొద్ది మెట్రిక్ టన్నుల ఇసుకను ఆనందపురం గ్రామ సమీపంలో ఓ రిసార్ట్స్ వెనక అక్రమంగా నిల్వచేసిన 24 క్యూబుక్ మీటర్ల ఇసుక నిల్వలను స్థానిక గిరిధర్ 2 స్వాధీనం చేసుకోవటం పై తెలంగాణ పత్రిక ఏజెన్సీలోని అక్రమ ఇసుక నిల్వలు స్వాధీనం కథనంపై స్థానిక తాసిల్దార్ పుల్లారావు మరింత పెంచారు. ములకలపల్లి మండలంలోని వీకే రామవరం గ్రామపంచాయతీ కొత్తూరు గ్రామ పరిధిలోని బుధవారం నాడు సుమారు 25 ట్రాక్టర్ల ఇసుక నిల్వలను తాసిల్దార్ మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మూకుముడిగా దాడి చేయడం అటువంటి సందర్భంలో ఇసుక మాఫియా చాకచక్యంగా తప్పించుకోవటం వంటి సంఘటనలు చక చక జరిగినట్లు విశ్వసనీయ సమాచారం ఏది ఏమైనా మన ప్రగతి న్యూస్ కథనానికి స్థానిక రెవెన్యూ అధికారులు అక్రమ ఇసుక నిలువలపై మరింత దూకుడు పెంచినట్లు తేటతెల్లమవుతుంది ఇటువంటి దాడుల్లో అవసరమైతే కేసులు సైతం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ పరమైన వనరులను దొంగిలించుటకు ఎలాంటి అనుమతులు లేవని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాలను చూస్తున్నామని ఇటువంటి స్వాధీనం చేసుకున్న ఇసుకను తాసిల్దార్ కార్యాలయానికి తరలించడం జరుగుతుందని దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విధంగా విధి నిర్వహణ కొనసాగిస్తామని మీడియా ముఖంగా తాసిల్దార్ పుల్లారావు తెలపడం జరిగింది.
