నవాబ్ పేట రిజర్వాయర్ ను సందర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
మనప్రగతి న్యూస్/ దేవరుప్పుల:
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయమని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.లింగాల ఘనపురం మండలం,నవాబుపేట రిజర్వాయర్‌ను శుక్రవారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సందర్శించారు.రిజర్వాయర్ నుండి పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల,పాలకుర్తి మండలాలకు సంబంధించిన గ్రామాలకు సాగు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చరవాణిలో అధికారులను ఆదేశించారు.మండలంలోని సింగరాజుపల్లి,పెద్దమడూరు చిన్నమడూరు 4L కెనాల్స్‌ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.రైతులు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని వాటిని పరిష్కరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని అన్నారు.ఈ కార్యక్రమం ఎమ్మెల్యే వెంట దేవరుప్పుల మండల బీసీ సెల్ అధ్యక్షుడు కాశబోయిన గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోనగిరి యాకస్వామి మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న యాదవ్ రామచంద్రనాయక్ బోనగిరి నరసింహ నల్ల యాదగిరి రవీందర్ రెడ్డి మాసంపల్లి సాత్విక్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు.