Breaking News

గణిత అండ్ సైన్స్ ఒలంపియాడ్ పరీక్షల్లో విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థుల అపూర్వ ప్రతిభ

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

శ్రీనివాస రామానుజన్ రాష్ట్రస్థాయి గణిత మరియు సైన్స్ ఒలంపియాడ్ పరీక్షల్లో విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర మరియు జిల్లాస్థాయిలో పతకాలను సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ జావేద్ ఒక ప్రకటనలో తెలిపారు.
హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిన్న జరిగిన బహుమతి ప్రధానోత్సవం లో పాఠశాలకు చెందిన 8వ తరగతి కే. కౌశిక్ గణిత ఒలంపియాడ్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం, 4వ తరగతి మీర్ ఉస్మాన్ అలీ సైన్స్ ఒలంపియాడ్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించగా, గణిత, సైన్స్ ఒలంపియాడ్ పరీక్షల్లో జిల్లా స్థాయిలో 10 వ తరగతి ముంజాల సాయి కిరణ్, అనన్య, అర్జున్, అన్వేష్, సుహాస్ ప్రిన్స్, 9వ తరగతి అర్మాన్ షా, ఫర్మాన్ షా, అబ్దుల్ ముఖీత్, మనోజ్ఞ, 8వ తరగతి దాసరి నిహారిక, సాయిహర్ష, బేరి మనోజ్ఞ, సుశాంత్, 7వ తరగతి అసద్, సుశాంత్, కొప్పు యశ్వంత్, విశ్వేశ్ చౌహాన్, చెన్నబోయిన చరణ్, షహజాద్, 6వ తరగతి పుల్లూరి రాజా గౌడ్, శశిధర్, శ్రీనిధి, నాసిర్ అలీ, 5వ తరగతి అంకిత్ చంద్ర, సాత్విక్ కృష్ణ, శ్రీహిత్ రెడ్డి, చరణ్, 4వ తరగతి మీర్ ఉస్మాన్ అలీ, మహమ్మద్ డ్యానిష్, షణ్ముఖ ప్రియ, 3వ తరగతి హిమాచరితారెడ్డి, ప్రేమ్ విరాన్, తన్మయ్ శ్రీ,లు బహుమతులు సాధించారు. వీరికి కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, ఏసిపి పింగళి ప్రతాపరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్, తిరుమలరావు, ఎస్ఆర్ఏఫ్ ఫౌండేషన్ చైర్మన్ అమరేష్ లు అభినందించారు. రాష్ట్ర స్థాయిలో రాణించి పాఠశాల పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేసిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, అకాడమిక్ ఇన్చార్జి నాజియా ఇక్బాల్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీమ్ సుల్తాన, రఘుపతి రెడ్డి, శివరాజ్ లతోపాటు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం