Breaking News

స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి.

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా పనిచేయాలి.

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బానోత్ మదన్ లాల్
ఆదేశాలు మేరకు ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం ఏన్కూర్ మండల కేంద్రంలో నిర్వహించారు.
మాజీ దిశా కమిటీ సభ్యులు బాదావత్ బాలాజీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సైన్యం సత్తా చాటాలని, ఏన్కూర్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడంలో విఫలమైందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని,
ఏన్కూరు మండలంలోని ఉన్నటువంటి ప్రధాన సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే ప్రతి వ్యక్తిని గెలిపించాలని, కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడాను ప్రజలు గమనించారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం


ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. మరియు. మాజీ ప్రజాప్రతినిధులు. మండల నాయకులు. యువజన నాయకులు. గ్రామ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు