మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్
ఏన్కూర్ లోని బాలికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని భార్గవి కరాటే పోటీలలో తన ప్రతిభను కనబరిచి స్ఫూర్తిగా నిలిచింది. పెనుబల్లి మండలం, వీఎం బంజర గ్రామంలో ఈనెల తొమ్మిదిన పనకోసి చోటా ఖాన్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ వారు నిర్వహించిన కరాటే పోటీలలో బాలికోన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న భార్గవి సిల్వర్ పథకాన్ని సాధించింది. టీ ఎల్ పేట గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ చల్లా మాధవి దగ్గర భార్గవి శిక్షణ తీసుకుంది. కరాటే మాస్టర్ శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలోనే సిల్వర్ పథకాన్ని సాధించడం విశేషం. భార్గవిని ప్రిన్సిపాల్ చంద్రిక, పిఈటి నరసయ్య, ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.