Breaking News

రాష్ట్రస్థాయి ఇంగ్లీష్ స్పెల్ బి పోటీల్లో విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థులకు బహుమతులు

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

రాష్ట్రస్థాయి ఇంగ్లీష్ స్పెల్ బి పోటీల్లో విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థులు అపూర్వ ప్రతిభను కనబరచి నగదు బహుమతులను సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రస్థాయిలో వివిధ జిల్లాల నుంచి దాదాపు 70 పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా విజ్ డమ్ హై స్కూల్ కు చెందిన 10వ తరగతి విద్యార్థి అల్లి అర్జున్ రాష్ట్రస్థాయిలో సూపర్ సీనియర్స్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి 10,116 రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీ సాధించగా, ఇదే సూపర్ సీనియర్స్ విభాగంలో 9వ తరగతికి చెందిన దీపక్ తృతీయ స్థానంలో నిలిచి 2,116 రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీ, జూనియర్స్ విభాగంలో 3వ తరగతికి చెందిన రాయిడి హిమచరితా రెడ్డి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి 5,116 రూపాయల నగదు బహుమతి తో పాటు ట్రోఫీ ని కైవసం చేసుకోవడం జరిగింది. వీరితోపాటు 10వ తరగతి సాయికిరణ్, 7వ తరగతి రిత్విక, సమన్విత, 6వ తరగతి సాఫ్రిన్, 3వ తరగతి వాత్సల్య, 2 వ తరగతి అర్జున్ కృష్ణ లు ప్రోత్సాహక బహుమతులను సాధించడం జరిగింది. ఈ బహుమతులను ప్రముఖ సినీ గేయ రచయిత, ప్రజా కవి జయరాజ్, గేయ రచయిత యస్బాల్, అక్షర నిర్మాణం ఫౌండేషన్ చైర్మన్ మంచాల నాగరాజు, నిర్మలా రాజన్ అందించడం జరిగింది. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి పాఠశాల ప్రతిష్టను ఇనుమడింపజేసిన విద్యార్థులను మరియు గైడ్ టీచర్ వీరభద్రయ్య, రాజేంద్రప్రసాద్, చెన్నస్వామి, దివ్య జ్యోతి, పృథ్వి, సునీత లను పాఠశాల డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, అకాడమిక్ ఇన్చార్జి నాజియా ఇక్బాల్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తాన, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం