మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్
మండలంలో ఉన్నటువంటి కరెంటు సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతూ సోమవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ను కలిసి సమస్యలను వివరించారు. గ్రామాలలో ఇండ్లపై నుండి, వ్యవసాయ క్షేత్రాలలో ప్రమాదకరంగా ఉన్నటువంటి కరెంటు తీగలను తొలగించాలని కోరారు. శిథిలావస్థకు చేరిన పాత స్తంభాలను మార్చి కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ భూక్య సక్రు నాయక్, మాజీ ఎంపీపీ ముక్తి వెంకటేశ్వర్లు,సీనియర్ నాయకులు గిద్దగిరి సత్యనారాయణ, కట్టా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.