మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
పట్టణంలో వాహనాలను తనిఖీ చేసి వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలించిన ఎస్సై గూడా అరుణ్ కుమార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వాహనానికి సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని, ప్రతి వాహనదారుడు హెల్మెట్ ని తప్పక ధరించవలెనని అన్నారు. ముఖ్యంగా మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వరాదని, అనుకోని ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులే బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు ఉన్నాయని, ఎక్కువగా ప్రమాదాలు మద్యం మత్తులో జరుగుతున్నాయన్నారు. ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించకూడదని, ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పకుండా ఉండాలన్నారు. వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణించరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.