Breaking News

యువతను వెక్కిరిస్తున్న తెలంగాణ క్రీడా ప్రాంగణం

సరియైన ఆట స్థలాలు లేక మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నా యువత

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

తెలంగాణ రాష్ట్ర సమితి హయాంలో పరిపాలనలో భాగంగా సామాన్య ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించింది దానిలో భాగంగా పాఠశాల విద్యార్థులు ఉన్నతంగా చదివి ఉన్నతమైన స్థానంలో ఉండాలని మానసిక ఒత్తిడి లేకుండా ఉండటం కోసం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక విద్యార్థి రాణించాలనే తలంపుతో ఒక మంచి ఆశయంతో అట్టహసంగా ప్రారంభించిన , తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, విద్యార్థులు,యువత ఆటలాడుకోవడానికి వీలు లేకుండా వెక్కిరిస్తూనట్లుగా బోర్డులు దర్శనమిస్తున్నాయి. వివరాలలోకి వెళితే నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ గౌతమ్ బాలవిహార్ నందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను ,యువతను ప్రోత్సాహించే ఉద్ధేశ్యం తో ఎంతో ఆర్భాటంగా తెలంగాణ క్రీడా ప్రాంగణం ను ఏర్పాటు చేసింది, మొదట్లో విద్యార్థులు కొన్ని ఆటలు ఆడినప్పటికి క్రమేపి తగ్గుముఖం పట్టింది తర్వాత తెలంగాణ, ఆంద్ర నీటి గొడవల పుణ్యమా అని ఆడుకునే వెసులుబాటు కూడ లేకుండా పోయింది. గౌతమ్ బాలవిహార్ ను ప్రత్యేక రక్షణా దళం వారు స్థిర నివాసం ఏర్పరుచుకొని కనీసం మానవమాత్రుడు లోపలికి పోవడానికి, రావటానికి వీలు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేసుకొని షిఫ్టులు వారిగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, ముఖ్యంగా యువత ఆటలాడుకోవడానికి సరియైన ఆట స్థలాలు లేక ఒక వేళ ఆట స్థలం ఉన్న కంపచెట్లు పెరిగి నిరూపయోగంగా ఉన్నాయని ముఖ్యంగా యువతను ప్రోత్సాహించే వ్యాయామ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటం చేత మానసిక ఒత్తిడి వలన సరియైన యోగాచేయించే వారు , మానసిక ఒత్తిడి నుండి దూరం చేయటానికి ఆటలు ఆడించే వారు లేకపోవటం వలన విద్యార్థులు చెడు అలవాట్లకు,మత్తు పదార్థాలకు బానిసలై క్షణికావేశం తో ఏమి చేస్తున్నారో అర్థం కాని స్థితిలో నేరాలకు పాల్పడిన సంఘటనలు నాగార్జున సాగర్ లో జరిగాయని దీనికి తోడు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉంటూ వారి యొక్క వ్యవహార శైలి ని గమనించక పోవటం చేత పిల్లలు నేరాలకు పాల్పడుతున్నారు ఇటివలే నాగార్జున సాగర్ లో మద్యం మత్తులో హత్యా సంఘటనలు జరగటం అలాగే ఒక యువకుడు సరియైన కుటుంబ ఆదరణ లేక మత్తు పదార్థాలకు అలవాటు పడి తొందరపాటు చర్య తో ఉరి వేసుకున్న సంఘటన పట్టణ ప్రాంతంలో స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది ఈ నేరాలన్ని జరగటానికి గల మూల కారణం విద్యార్థులు ఆటవిడుపు గా ఆడుకోవటానికి ఆట స్థలాలు కరవై ప్రోత్సాహం అందించే గురువులు లేక ఈ క్రీడా ప్రాంగణం వెలవెల పోతున్నాయని ఇప్పటికైనా సంబంధిత పాలన అధికారులు,ప్రతి పక్ష నాయకులు స్పందించి వెంటనే క్రీడా ప్రాంగణం లో విరివిగా ఆటలు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని , తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని స్థానిక ప్రజలు సంఘసంస్కర్తలు కోరుతున్నారు.