Breaking News

హెచ్ఐవి గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి.

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

హెచ్ఐవి గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని నల్లబెల్లి ఎంపీడీవో నరసింహమూర్తి అన్నారు. మండలంలోని బోలోనిపల్లి గ్రామంలో వై ఆర్ జి కేర్ ఎల్ డబ్ల్యూ ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో నరసింహమూర్తి పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో హెచ్ఐవి గురించిన అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలని, హెచ్ఐవి ప్రధానంగా అసురక్షిత సూదులు వాడడం, హెచ్ఐవి ఉన్న తల్లిదండ్రుల నుండి పిల్లలకు, అసురక్షిత లైంగిక సంబంధాలు, పరీక్షించని రక్త మార్పిడి ద్వారా ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవి వ్యాపిస్తుందని అన్నారు, ఇతర ఏ పద్ధతుల ద్వారా ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవి వ్యాపించదు అని అన్నారు. హెచ్ఐవి వారిపట్ల వివక్షత చూపకుండా ప్రజలలో సమానంగా చూడాలని అన్నారు. గ్రామాలలో హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పిస్తున్న వైఆర్జి కేర్ లింక్ వర్కర్ స్కీంను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రవి, పంచాయితీ కార్యదర్శి మౌనిక, వై ఆర్ జి కేర్ సూపర్వైజర్ రజిని, క్లస్టర్ వర్కర్ వీరన్న, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం