Breaking News

ఘనంగా సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు.

మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్

ఏన్కూర్ మండలం లోని భద్రు తండా గ్రామంలో మంగళవారం బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను సాధుసంత్ బానోత్ చందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్థానిక తహసిల్దార్ సి.హెచ్ శేషగిరిరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, భోగ్ బండారో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బంజారా ఆచార సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బంజారాల్లో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, దేశభక్తిని నింపిన మహానీయుడు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ అని, బంజారా లు సేవాలాల్ మహారాజుని స్ఫూర్తిగా తీసుకొని ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు.
ఈ కార్యక్రమానికి బానోత్ సక్రాం నాయక్ , బాదావత్ సేవ్య, గుగులోత్ బగ్గు,బానోత్ లక్ష్మ, దారావత్ కృష్ణ, వాంకుడోత్ లక్ష్మణ్, బోడ సురేష్ , బోడ మహేష్ ,బోడ ప్రవీణ్, తేజవతి ఈర్య , వాంకుడోత్ హుస్సేన్, మాలోత్ జగన్, తదితరులు పాల్గొన్నారు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం