మన ప్రగతి న్యూస్, కాప్రా , ఫిబ్రవరి 23,
కాలనీ రోడ్లపై చెత్త వేయరాదంటూ మధురానగర్ లో ఆదివారం పారిశుధ్య సిబ్బందితో కలిసి కాలనీ కుటుంబాలు స్వచ్ఛ కార్యక్రమం చేపట్టారు. కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుటుంబాలు ప్రతినిధులు పలుగు పారా గంపలు చేతబట్టి రోడ్లను ఊడ్చి చెత్త ఎత్తి పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. స్వచ్ఛభారత్ స్వచ్ఛ మధుర నగర్ వర్ధిల్లాలి, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, ప్లాస్టిక్ను వదిలేద్దాం, స్వచ్ఛ ఆటో లోనే చెత్తను వేద్దాం అంటూ కాలనీ సంక్షేమ సంఘం బ్యానర్ను పట్టుకొని వీధులలో ప్రదర్శన చేస్తూ అవగాహన కల్పించారు. స్వచ్ఛ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మా రెడ్డి, మధుర నగర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వాకిటి అనిలారెడ్డి, ఉపాధ్యక్షులు లింగం నాయక్, ఈశ్వర్, శ్రీనివాస్ నాయక్, మంత్ నాయక్, శ్రీనివాస్, నరసయ్య వేణు తదితరులు పాల్గొన్నారు.