_ ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.
_ మహా శివరాత్రి జాతర
_ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
మన ప్రగతి న్యూస్/
రాజన్న సిరిసిల్ల,
రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయము (కలెక్టరేట్) లో సోమవారం నాడు (24.02.2024) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని ప్రజలు వినతులు ఇవ్వడానికి సోమవారం కలెక్టరేట్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మహా శివరాత్రి జాతర సందర్భంలో అధికారులంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల, జాతర విధులలో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించ వలసిందిగా పేర్కొన్నారు.