మన ప్రగతి న్యూస్/కేసముద్రం :
కేసముద్రం స్టేషన్లో లాల్ బహదూర్ జాతీయ వ్యవసాయ మార్కెట్ ను సోమవారం నాడు మాజీ బిఆర్ఎస్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత సందర్శించనున్నారు..వీరి వెంట మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్,మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత,విచ్చేయుచున్నారు. అమీనాపురం చేరుకోగానే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మార్కెట్ సందర్శిస్తారు.కావున ఈ కార్యక్రమాన్ని కేసముద్రం మండల బిఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు,ఎంపీపీ జడ్పిటిసి,మార్కెట్ చైర్మన్ లు,పి ఎస్ సి ఎస్ చైర్మన్లు,వైస్ ఎంపీపీ,ఎంపీటీసీలు,సర్పంచులు,ఉపసర్పంచులు,వార్డు సభ్యులు,కో ఆప్షన్ మెంబర్లు, డైరెక్టర్లు,మండల కమిటీ సభ్యులు,గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు,గ్రామ మండల అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు,ముఖ్య కార్యకర్తలు,ముఖ్య నాయకులు,అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేయుచున్నాము..ఎక్కువ సంఖ్యలో హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ మండల పార్టీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్ తెలిపారు..