మన ప్రగతి న్యూస్/వీణవంక
వీణవంక మండలం లోని బేతిగల్ గ్రామం లో మర్చి 3నుంచి 6వరకు జరిగే భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మ విగ్రహా ప్రతిష్టాపనకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి వెలిశాల రాజేందర్ రావు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు ను గ్రామస్తులు ఆహ్వాణించారు. ప్రతిష్టాపనకు తప్పనిసరిగా వస్తామని వారు హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. 70ఏళ్ల తరువాత భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి ప్రతిష్టాపన జరుగుతుందని, గ్రామస్తుల సహకారం తో విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. అంగరంగా వైభవంగా పండుగ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.ఇటీవల పోచమ్మ గుడి ని వెలమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.