Breaking News

అప్పుల బాధ తో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి

_ నిరుపేద కుటుంబం పోతుగల్ గ్రామవాసి

_ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలి

_ గ్రామ స్థానిక ప్రజాప్రతినిధులు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్

రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన కౌలు రైతు జెల్లా దేవయ్య 51సం:లు అనుఅతను అప్పుల బాధతో కౌలు రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అతనికి భార్య పద్మ,కూతురు రేఖ,కొడుకు అజయ్ పిల్లలు ఉన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ..జెల్లా దేవయ్య గ్రామానికి సమీపంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని అందులో వరి పంట సాగు చేశాడు.వరి సాగుకు నీరు అందక ఎండిపోవడం చూసి అప్పుల బాధ ఎలా తీర్చాలో తీరుతాయని తెలియక మనస్థాపానికి గురి అయ్యి పురుగుల మందుతాగి మరణించాడు.ఈ నిరుపేద కుటుంబాని జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజా ప్రతినిధులు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ స్థానిక పెద్దలు కోరారు.