Breaking News

కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలి

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

రాజకీయ పార్టీలు అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో రోబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించాలి అందుకోసం గ్రూపులకు వర్గాలకు తావివ్వకుండా సమిష్టిగా కలిసి పని చేయాలి.మన పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి.గ్రామశాఖ అధ్యక్షులుగా ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక కాబడిన వారు గ్రామ ప్రజలతో సత్సంబంధాలు కలిగి వారిని చైతన్య పరుస్తూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పార్టీని మరింత పటిష్టంగా తయారు చేయాలి.పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుంది పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి అవకాశాలు వాటంతట అవే వస్తాయి.గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.