Breaking News

హన్మకొండ,వరంగల్, కాజీపేట ఏరియా ప్రజలకి విజ్ఞప్తి

మన ప్రగతి న్యూస్/ ఉమ్మడి వరంగల్ బ్యూరో

తేదీ 26-2-2025 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పూజల నిమిత్తం భక్తులు తమ వాహనాల్లో వేయిస్తంభాల గుడికి వేలాది గా తరలివస్తారు. కానీ ఆలయం దగ్గర పరిసరాలలో ఎలాంటి పార్కింగ్ స్థలాలు లేవు. కావునా భక్తులు సాధ్యమైనంత త్వరగా ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకోవాలనే ఉద్దేశ్యం తో ట్రాఫిక్ రాకపోకలను క్రమబద్దీకరణ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ములుగు X రోడ్ నుండి వేయిస్తంభాల గుడి వైపు వచ్చే భక్తుల వాహనాలను అలంకార్ జంక్షన్ వరకు మాత్రమే అనుమతిస్తారు. హన్మకొండ చౌరస్తా నుంచి వచ్చే భక్తుల వాహనాలను అమృత జంక్షన్ వరకు మాత్రమే అనుమతిస్తారు. కావున భక్తులు ఇది గమనించి తమ ఏర్పాట్లు చేసుకోవాలని మనవి. అలాగే ములుగు X రోడ్డు నుండి వేయిస్తంభాల గుడి వైపు వచ్చే సాధారణ వాహనాలు టూవీలర్స్, ఆటోలు, కార్లు మొదలగు వాహనాలు అలంకార్ సెంటర్, కాపువాడ, బాలంజినేయ స్వామి దేవాలయం మీదుగా ప్రయాణించాలి. మరియు అలంకార్ సెంటర్ నుండి బాలాంజినేయస్వామి దేవాలయం వరకు ( కాపువాడ వైపు)రోడ్ కి రెండు వైపులా ఎటువంటి వాహనాలు పార్కింగ్ చేయరాదు. మరియు రిపేరింగ్ వాహనాలను రోడ్ పై రిపేర్ చేయరాదు. ఈ మార్గంలో ఇతర తోపుడు బండ్లు కూడా అనుమతించబడవు. అలాగే బాలంజినేయ దేవాలయం నుంచి కాపువాడ వైపు ఎటువంటి వాహనాలు అనుమతించబడవు. అలాగే హన్మకొండ చౌరస్తా నుండి వేయిస్తంభాల గుడి వైపు ప్రయాణించే సాధారణ వాహనదారులు, అమృత జంక్షన్ నుండి యాదవనగర్ మీదుగా వెళ్లవలెను. అంతే కాకుండా వేయిస్తంభాల ఆలయ పరిసర ప్రాంతాలలోని మెయిన్ రోడ్డులో వాహనాలను పార్కింగ్ చేయరాదు. ఈ ఆంక్షలు 26-2-2025 ఉదయం 3 గంటల నుండి 27-2-2025 మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. కావున ఈ మార్గంలో ప్రయాణించే వారు ఇతర alternative రోడ్లలో ప్రయాణించి తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసు హన్మకొండ వారి సూచన/విన్నపము.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం