Breaking News

వేములవాడ లో మహాశివరాత్రి జాతర

_ రంగురంగుల లైట్స్‌లో ఆలయ శోభ

_ భక్తులకు కనువిందు

మన ప్రగతి న్యూస్/ వేములవాడ ప్రతినిధి

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక లైట్స్, డ్రోన్ వీడియోలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి

.రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం శోభాయమానంగా కనువిందు చేస్తుంది. ప్రతి సంవత్సరం రాజన్న గుడిలో మూడు రోజులపాటు మహాశివరాత్రి జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే ప్రత్యేకమైన లైట్స్‌లో వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆలయ అధికారులు మహాశివరాత్రి జాతర నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.ధర్మదేవత స్వరూపమైనటు కోడెపై (ఆవుపై) విఘ్నేశ్వర, కార్తికేయ సమేతంగా శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ప్రతిమ ఆలయ మెయిన్ ఎంట్రెన్స్‌ చెట్టు సమీపంలో ఏర్పాటు చేశారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రధాన మొక్కు కోడె.. మొక్కులన్న విషయం మనందరికీ తెలిసిందే.మహాశివరాత్రి జాతర నేపథ్యంలో రాత్రి సమయంలో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను డ్రోన్ వీడియోను ఆలయ అధికారులు చిత్రీకరించారు. దీంతో దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయిసామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ముఖ్యంగా జాగరణ చేస్తున్న భక్తజనం కోసం ప్రత్యేకమైన చలువ పందిళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు.

ప్రత్యేకమైన లైటింగ్ సిస్టంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను పెంచే విధంగా దర్శనమిస్తున్నాయి.వివిధ ప్రాంతాల నుంచి వేములవాడ ప్రాంతానికి ఎంట్రన్స్ ప్రాంతం అయినటువంటి వేములవాడ మూల వాగు బ్రిడ్జి సైతం.. ప్రత్యేకమైన రంగురంగుల లైటింగ్ సిస్టమ్స్‌తో రాజన్న భక్తులను స్వాగతం పలుకుతోంది. డ్రోన్ వీడియోతో పాటు ఫోటోలు అత్యద్భుతంగా, కన్నుల పండువగా కన్పిస్తోంది.


వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. 2 రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, శివార్చన ఆలయ పార్కింగ్ స్థలంలో జాగారాలు చేసే భక్తుల కోసం.. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఏర్పాటు చేసినట్లు ఈవో వినోద్ తెలిపారు.సుమారు రెండు కోట్ల 39 లక్షలతో మహాశివరాత్రి జాతర కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. నాలుగు లక్షల మంది భక్తజనం వస్తారని అంచనాతో ఏర్పాటు చేశామన్నారు. చిన్న మేడారం సమ్మక్క సారలమ్మ ఉన్న తరుణంలో అధిక సంఖ్యలోనే భక్తులు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి మహాశివరాత్రి జాతర పర్వదినాన వస్తారన్నారు