Breaking News

వృద్ధురాలి హత్య కేసు నిందితులను పట్టుకున్న పోలీసులు

మన ప్రగతి న్యూస్ చిట్యాల

టేకుమట్ల మండలం గరిమిళ్ళపల్లి గ్రామానికి చెందిన సూరపాక వీరమ్మ (75) అనే మహిళను హత్య చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేసి పట్టుకున్నారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీఐ మల్లేష్ తో కలిసి భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు మాట్లాడారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం వీరమ్మ ఈనెల 19న పరిసర గ్రామంలో చింతపండు అమ్ముతున్న క్రమంలో గ్రామానికి చెందిన బోయిని మల్లయ్య పుట్టకొక్కుల శ్రీనివాసు మద్దెల సిద్ధూ అనే ముగ్గురు వ్యక్తులు వీరమ్మ ను చెట్ల చాటుకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపారు. మృతదేహాన్ని గోనే సంచులో కుక్కి పసిక మనేమ్మ అనే రైతు వ్యవసాయ బావిలో పడ వేశారు. ఈనెల 23న బావి నుండి దుర్వాసన రాగా పోలీసులకు తెలుపగా మృతదేహాన్ని బయటకు తీశారు. బోయిని మల్లయ్య అనే నిందితుడి కూతురు అనారోగ్యానికి కారణం వీరమ్మ మంత్రాలు చేస్తుందని బంధువు పుట్టకొక్కుల శ్రీనివాస్ అనే మరో నిందితుడు తెలపగా నిందితులు ఆమెను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలకు చెందిన నిందితుల నుండి 2 తులాల బంగారం 30 తులాల వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేయడంలో చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ టేకుమట్ల మండల ఎస్సై ని డీఎస్పీ అభినందించారు. మూఢనమ్మకాల పేరుతో ఇలాంటి సంఘటన చేయడం చట్టరీత్యా నేరం అని అన్నారు అనారోగ్యానికి గురి అయితే వెంటనే ఆసుపత్రికి వెళ్లి మెరుగైన చికిత్స తీసుకోవాలని డీఎస్పీ సూచించారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం