Breaking News

కమనీయం రమణీయం శివపార్వతుల కళ్యాణం 

పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించిన అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ 

కళ్యాణం లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బుధవారం రాత్రి ఆలయ కళ్యాణ మండపంలో శివపార్వతుల కళ్యాణం కమనీయం, రమణీయంగా కన్నుల పండుగగా జరిగింది. శివపార్వతుల కళ్యాణానికి జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్, స్టేషన్ ఘన్ పూర్ ఆర్డిఓ డిఎస్ వెంకన్న, ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు పట్టు వస్త్రాలతో పాటు తలంబ్రాలను భాజ భజంత్రీలతో వేద పండితుల మంత్రోత్సవాలతో తీసుకొచ్చారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

తాటిపాముల నరసింహమూర్తి శర్మ ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, సి ఎఫ్ ఓ లక్ష్మీ ప్రసన్న పర్యవేక్షణలో కమనీయం, రమనీయంగా జరిగిన శివపార్వతుల కళ్యాణానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. శివపార్వతుల కళ్యాణం సందర్భంగా క వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన భక్తులు వీక్షించేందుకు అధికారులు స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.

శివపార్వతుల కళ్యాణ కార్యక్రమానికి పాలకుర్తి మార్కెట్ చైర్ పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, తొర్రూర్ మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్ లతోపాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.