అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం.
మా ప్రగతి న్యూస్ /ఏన్కూర్

మండల వ్యాప్తంగా బుధవారం శివరాత్రి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఏన్కూర్, టీ ఎల్ పేట, గార్ల ఒడ్డు , నాచారం, హిమామ్ నగర్, జన్నారం, నూకలంపాడు,
ఆరికాయలపాడు, తిమ్మారావుపేట తదితర గ్రామాలలోని దేవాలయాలలో పూజలు చేశారు.

ఏన్కూర్, బురద రాగాపురం. గ్రామాలలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. హోమాలు నిర్వహించారు .

శివాలయాలలో బుధవారం రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
