మంటలను ఆర్పి వేసిన అటవీ సిబ్బంది.
నిర్లక్ష్యం వద్దనిఅటవీశాఖ విన్నపం.
మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి
జైపూర్ మండలం లోని వేలాల గుట్ట పై అడవిలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకొని మంటలు చెలరేగాయి. వీటిని గమనించిన అటవీ సిబ్బంది వెంటనే ఫైర్ బ్లోయర్ సహాయం తో అర్పివేశారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని వేలాల గుట్ట పై అటవీ ప్రాంతంలో గట్టు మల్లన్న జాతర జరుగుతోంది. ఈ సందర్బంగా ఇక్కడ గుట్ట పై నిద్రించడానికి చాలా మంది భక్తులు విచ్చేసారు. రాత్రి ఇక్కడికి విచ్చేసిన వారిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నిర్లక్ష్యం వల్ల అడవిలో మంటలు చెలరేగాయి. రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వేలాల బీట్ అధికారి శ్రీధర్ మంటలను గమనించి తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) వాచర్ సాయికిరణ్ ను ఫైర్ బ్లోయర్ తీసుకు రమ్మని చెప్పారు. వెంటనే ఫైర్ బ్లోయర్ తీసుకు వచ్చి మంటలు విస్తరించ కుండా వాటిని అర్పివేశారు.ప్రమాద స్థలాన్ని రాత్రి ఎఫ్ ఎస్ ఓ భగవంత్ రావు పరిశీలించారు. ఒక వేళ ఈ మంటలను ఆర్పక పోతే అడవికి నష్టం తో పాటు వేలాల జాతరకు వచ్చిన భక్తులకు ప్రమాదకరంగా ఉండేది. సకాలంలో అప్రమత్త మైన బీట్అధికారి శ్రీధర్ ను, అడవిలో మంటలను ఫైర్ బ్లోయర్ తో అర్పివేసిన టీజీ ఎఫ్ డీసీ వాచర్ సాయికిరణ్ ను మంచిర్యాల రేంజ్ ఎఫ్. ఆర్ .ఓ రత్నాకర్ రావు, టీజీ ఎఫ్ డీసీ ప్లాంటేషన్ మేనేజర్ జి.సురేష్ కుమార్ లు అభిందించారు.జాతరకు విచ్చేసే భక్తులు అడవిలో వంట చేసుకున్న తర్వాత ఆ మంటలను ఆర్పివేయాలన్నారు . బీడీలు, చుట్టలు తాగే అలవాటు ఉన్నవారు వాటిని తాగి నిర్లక్ష్యంగా అడవిలో పడేయవద్దని కోరారు.అడవి కాలిపోతే ఎంతో నష్టమని, దీనిని అందరూ గమనించి అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు.