మన ప్రగతిన్యూస్/ చిట్యాల
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో చలివాగుపై నిర్మించిన చెక్ డాం కు బుధవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టారు. చలి వాగు శివారులోని పంట పొలాలకు సాగునీరు కోసం రైతులు ఈ పని చేసి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.దీంతో చలివాగులో నిల్వ ఉన్న నీరు మొత్తం కింది ప్రాంతాలకు వెళ్ళొచ్చని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.