మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ డివిజన్:

బాన్సువాడ డివిజన్లోని పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓటింగ్ సరళని పరిశీలించిన బాన్సువాడ డివిజన్ సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ఓటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయడం జరిగిందన్నారు.డివిజన్లోని అన్ని మండలాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని ఆమె తెలిపారు.అన్ని మండలాల్లో పోలింగ్ కేంద్రాలు పరిశీలించి డివిజన్లోని అన్ని మండలాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటింగ్ బాధ్యతతో ఉపయోగించుకోవడం జరిగిందని ఆమె అన్నారు.

ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా సాగాయని, ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు.డివిజన్లోని అన్ని మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగాయని, డివిజన్ లోనీ అన్ని మండలాల్లో ఉపాధ్యాయుల ఓట్లు 517 ఓటర్లకు గాను 490 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, అదే క్రమంలో పట్టభద్రుల ఓట్లు 4405 ఉండగా 3449 మంది ఓటు హక్కును ఉపయోగించుకున్నట్లు ఓటింగ్ సమయం ముగిసే వరకు వినియోగించుకున్నట్లు ఆమె తెలిపారు. ఇది ఇలా ఉండగా ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులూ కార్యకర్తలు తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకుగాను పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

