మన ప్రగతి న్యూస్/ములకలపల్లి
ములకలపల్లి మండలంలోని డిసిసిబి బ్యాంకు మేనేజర్ డి సతీష్ గురువారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిసిసిబి బ్యాంకు మేనేజర్ డి సతీష్ మాట్లాడుతూ వ్యవసాయ రుణాలు, గేదెల రుణాలు, ముద్ర రుణాలు, మార్ట్ గేజ్ రుణాలు పొందిన వారు వారి రుణాలను వాయిదాల పద్ధతిలో సకాలంలో చెల్లించాలని కోరారు . ఈ వ్యవసాయ రుణాలు పొందిన వారు సంవత్సరం లోపు రెన్యువల్ చేయడం ద్వారా ఏడు శాతం మాత్రమే వడ్డీ పడుతుందని, నిర్దిష్ట తేదీ లోపు చెల్లించిన వారికి తిరిగి మూడు శాతం వారి ఖాతాకు జమవుతుందని తెలిపారు. అలా కాకుండా సంవత్సరంలోపు రెన్యువల్ చేయకపోయినచో అధిక వడ్డీ చెల్లించవలసి వస్తుందని, ఇంకా ఎక్కువ సమయం అయినచో ఎన్ పిఏ ఖాతాదారులుగా గుర్తించబడుతున్నారని అన్నారు. ఈ విషయంపై బ్యాంకు ఖాతాదారులు అందరూ అవగాహన పెంచుకొని సరైన సమయంలో చెల్లించాలని కోరారు. ఎన్పీఏ ఖాతాదారులు మార్చి 15లోగా రెన్యువల్ చేసుకోవాలని, ఏ విధమైన బ్యాంక్ అవసరాలు ఉన్న , ఎటువంటి సందేహాలు ఉన్న నేరుగా ఖాతాదారులే డిసిసిబి బ్యాంకుకు వచ్చి సంప్రదించాలని, దళారుల వద్దకు వెళ్లవద్దని తెలిపారు. అదేవిధంగా మా బ్యాంకు నందు క్రాఫ్ లోన్స్ 200, 3.3 కోట్లు అప్పు, గేదల లోన్స్ 83, 53. లక్షలు అప్పు, ఎస్ హెచ్ జి, ముద్ర మరియు మార్టుగేజ్ లోన్స్ 100 వాటి అప్పు 3 కోట్ల రూపాయలు ఉంటుందని బ్యాంకు మేనేజర్ డి సతీష్ తెలిపారు. ఆనంతరం డిపాజిట్ల పై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న ఏకైక బ్యాంకు అని గోల్డ్ లోన్ కు అత్యధికంగా గ్రాముకు 5800 రుపాయలు ఇస్తున్నామని ఈ గోల్డ్ లోన్ కోసం ఏవరైనా వస్తే పది నిమిషాల్లో ఇస్తున్నామని తెలిపారు.
