Breaking News

శివుడి సేవలో శివాజీ సేన

మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో శివరాత్రి పర్వదినాన జరిగిన వేలాల శ్రీ గట్టుమల్లన్న స్వామి జాతరలో జైపూర్ మండల ఛత్రపతి శివాజీ సేన కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు సేవలందించారు. భక్తులకు మంచినీటిని అందించడం, భక్తుల రద్దీ తగ్గించే చర్యలు తీసుకోవడం,భక్తుల సౌకర్యార్థం తగిన సేవలు అందించి జైపూర్ మండల కేంద్రంగా ఉన్న దేవాలయాల పరిరక్షణ మరియు వాటి సేవలో ఎల్లప్పుడూ శివాజీ సేన ముందు ఉంటుంది అని శివాజీ సేన సభ్యులు అన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం