మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తన చీర కొంగు వెనుక చక్రంలో ఇరుక్కుని కింద పడగా చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం…..పోతిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన అంబటి అమృత (53) తన భర్త రాజేందర్ కలిసి తమ కారులో మూడు రోజుల క్రితం శివరాత్రి పండుగకు సంబంధించిన సరుకులు కొనేందుకు వెంకటాపూర్ వెళ్లారు. అక్కడ సరుకులు తీసుకుంటున్న సమయంలో తమ కూతురు నిజామాబాదు నుండి బస్సులో వస్తున్నట్లు సమాచారం ఉండడంతో కూతుర్ని నేను కారులో ఎక్కించుకొని వస్తానని ఆలోపు అమృతను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోతిరెడ్డి పల్లె వెళ్తుండగా లిఫ్టు అడిగి ఎక్కించాడు. మార్గమధ్యంలో తన చీర కొంగు వెనక చక్రంలో ఇరుకడంతో బండి పై నుండి కింద పడిపోయింది. వెంటనే చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కి తరలించి అనంతరం మెరుగైన వైద్యానికి కరీంనగర్ తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం చనిపోయింది. కాగా మృతురాలికి ముగ్గురు కుమార్తెలు ఒకరు అమెరికాలో స్థిరపడగా మరొకరు వెంకటాపూర్, చిన్న కూతురిది నిజామాబాదద్ మృతి చెందిన విషయం అమెరికాలో ఉన్న కూతురుకు తెలపడంతో గురువారం ఉదయం స్వగ్రామానికి చేరుకోగా అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారంలో మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సోషల్ మీడియా కన్వీనర్ సుధాకర్ రావు తదితరులు పాల్గొని విచారం వ్యక్తం చేశారు.