Breaking News

అదనపు కట్నం కోసం భార్యను వేదించిన భర్త

_ ఏడాదిన్నర జైలు శిక్ష

_ రూ.3,000/-రూ.జరిమానా

మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

అదనపు కట్నం కోసం భార్యను వేదించిన భర్తకు ఏడాదిన్నర జైలు శిక్షతో పాటు రూ. 3000/- రూల జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ గురువారం తీర్పు వెల్లడించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ముస్తాబద్ ఎస్.ఐ మాట్లాడుతూ..
సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన వనమా యాదగిరికి ముస్తాబద్ గ్రామనికి చెందిన వనమా లక్మితో 1996 సంవత్సరంలో వివాహం జరిగింది.వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం కలుగగా, కొన్నేళ్ల తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేదింపులకు గురిచేసేవాడు.వేధింపులు భరించలేక 2015 సంవత్సరంలో ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో వనమా యాదగిరి పై ఫిర్యాదు చేసింది. పోలీసులు వనమా యాదగిరిపై కేసు నమోదు చేసి కోర్టులో అప్పటి SI మారుతి చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యుషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ వాదించగా ముస్తాబాద్ ఎస్.ఐ. గణేశ్ CMS ఎస్.ఐ.శ్రావణ్ కోర్టు కానిస్టేబుల్ దేవేందర్ ఐదుగురు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.నిందుతుడు వనమా యాదగిరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ప్రవీణ్ నిందితునికి
ఏడాదిన్నర జైలు శిక్షతో పాటు రూ. 3000/- రూల జరిమానా విధించినట్లు ఎస్.ఐ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు.