Breaking News

ఫుడ్ ఇన్స్పెక్టర్ మండలంలో ఆకస్మిక తనిఖీ

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

మండలంలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పద్మావతి ఏజెన్సీస్ కూల్ డ్రింక్ షాప్ లో ఎక్స్పైరీ డేట్ కూల్ డ్రింక్ అమ్ముతున్నారని సమాచారంతో తనకి నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఏజెన్సీలో ఎక్స్పైర్ అయిన 68 వేల రూపాయల కూల్ డ్రింక్స్ ను సీజ్ చేశారు. వారు మాట్లాడుతూ కిరాణా షాపులలో ఎక్స్పైర్ అయిన వస్తువులు అమ్మిన చట్టరీత్యా చర్య తీసుకుంటామని అన్నారు. కొనుగోలుదారులు వస్తువులు తీసుకునేటప్పుడు సరైన డేట్ చూసి తీసుకోవాలని తెలిపారు. ఈ తనిఖీలొ కానిస్టేబుల్ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం