Breaking News

శ్రీ చైతన్య కార్ఖానా స్కూల్‌లో సైన్స్ ఫెయిర్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహణ

మన ప్రగతి న్యూస్ /మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి

శ్రీ చైతన్య కార్ఖానా స్కూల్‌లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో “సైన్స్ ఫెయిర్” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ డాక్టర్ భానుప్రియ సైకాలజిస్ట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన ప్రసంగంలో, విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు.కార్యక్రమంలో ప్రథమ ఉపాధ్యాయులు రాధిక, ఉపాధ్యాయులు కృష్ణంరాజు, ఇంచార్జ్ బిందు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శనలతో కూడిన ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం