Breaking News

నిబంధనలకు తిలోదకాలు రోడ్డుపైనే చెట్ల పెంపకం

నిద్ర మత్తులో ఆర్ అండ్ బి అధికారులు

లక్షల రూపాయలు వృధా అయినట్టేన

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

లెంకాలపల్లి నుండి నందిగామ కు వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డుపైనే ఇరుపక్కల చెట్లు నాటుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఈ యొక్క ఆర్ అండ్ బి రోడ్డు 40 ఫీట్ల వెడల్పుతో ఉండగా ఇరుపక్కల రైతులు ఆక్రమించుకోగా కేవలం 13 ఫీట్ల వెడల్పు ఉంది. కానీ 40 ఫీట్లు వదిలిపెట్టి ఇరుపక్కల చెట్లు నాటవలసింది పోయి కేవలం 13 ఫీట్ల రోడ్డుపైనే ఇరుపక్కల చెట్లు నాటుతున్నారు .మధ్యలో 10 ఫీట్ల బీటీ రోడ్డు మాత్రమే ఉంటుంది. లక్షల రూపాయల వృధా అవుతున్న ఆర్ అండ్ బి అధికారులు నిద్రమత్తులో మూలుగుతున్నారు. ఇలా 13 ఫీట్ల వెడల్పులో చెట్లు నాటడం వలన వచ్చిపోయే వాహనాలకు ఇబ్బందులు తప్పవు ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు చేరుకొని రోడ్డు వెడల్పు 40 ఫీట్లు తీసి ఇరుపక్కల చెట్లను నాటే విధంగా పూనుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ ఈ విషయంపై విచారణ చేపట్టి రోడ్డును ఆక్రమించిన రైతులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరడం జరుగుతుంది.