Breaking News

ప్రైవేట్ పాఠశాల కు పదవ తరగతి పరీక్ష కేంద్రం కేటాయించడంలో ఆంతర్యం ఏమిటి

సబ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా కలెక్టర్ కు లేక

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మండల కేంద్రంలో సబ్ పోస్ట్ ఆఫీస్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ మేడంకి తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో లేక పంపించారు. అనంతరం దళిత విద్యావంతుల వేదిక కార్యదర్శి బట్టు సాంబయ్య మాట్లాడుతూ.. మండల కేంద్రంలో 354 మంది విద్యార్థులకు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలకు ఒక పరీక్ష కేంద్రం, ప్రవేట్ పాఠశాలకు మరొక కేంద్రాన్ని కేటాయించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గతంలో నల్లబెల్లి ప్రాథమిక పాఠశాలలో 20 సంవత్సరాల నుండి అన్ని సౌకర్యాలు ఉండి పదో తరగతి పరీక్ష కేంద్రం నిర్వహించేవారు. అలాంటి స్కూలును పక్కకు పెట్టి ప్రైవేట్ పాఠశాల కేటాయించడంలో ఆంతర్యమేమిటి అన్నారు. ఈ విషయంపై కలెక్టర్ తక్షణమే స్పందించి విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇనుగాల రవి, బొట్ల దయాకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.