శ్రీ రామాచార్య భక్తులనుద్దెశించి దైవ పూజలతో ఇంటిల్లిపాది శుభం జరుగుతుంది.. మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
పట్టణంలోని డఫోడిల్స్ పాఠశాల ఆవరణలో శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణం ఘనంగా జరిగింది. కార్తీక మాసం దైవ పూజలకు ఎంతో పవిత్రమైన రోజు తోలుత భక్తుల మధ్య
గట్టు నారాయణా చార్యులు దేవీ ఉపాసకుల వారిచె శ్రీ లక్ష్మీ నరసింహ సహస్రనామ పారాయణం చేయిoచారు. నర్సంపేట శాఖ వికాస తరంగిని వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ విష్ణు సహస్ర నామ పారాయణం చేశారు. ఆనంతరం కొమ్మాల లక్ష్మీ నరాసిoహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి. రామాచార్య, ఆడిగోప్పుల విష్ణు, తూప్రాని పనీంద్ర, మరింగంటి నర్సింహా చార్యులు, దాస్యం రంగనాధ స్వామి వేద పండితుల మధ్య దేవదేవుడి కళ్యాణం ఘనంగా జరిగింది. ఇట్టి ఆధ్యాత్మిక కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ చింతల నరేందర్, చింతల నిరంజన్
శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి వారికీ పట్టు వస్రాలు, గజమాల, పాఠాశాల వేదిక అంత కూడా ఒక ఆధ్యాత్మిక ఆలయములాగా రూపుదిద్దుతుంది. రంగు రంగుల విద్యుత్ దీపాలతో కార్తీక మాసం భక్తుల దంపతుల మధ్య కళ్యాణం ఘనంగా జరిగింది.భక్తులకు రక్షా కంకణాలు అందించారు. కైoకర్య భక్తులకు శేష వస్త్రాలు అర్చన పూజధికాలు తలంబ్రాలు అందించారు. చివరగా అందరికి ప్రసాద వితరణతొ కార్యక్రమంతో పరిపూర్ణమైనది…