Breaking News

కుల గణనకు సహకరించండి

బీసీ సమాజ్ నిర్వహించిన బీసీ సదస్సులో ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ టి.చిరంజీవులు…

ఉమ్మడి మహబూబ్ నగర్ :రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణకు ప్రతి ఒక్కరు సహకరించాలని, అప్పుడే బీసీల లెక్కలు తెలుతాయని, అప్పుడే మనం ఎంతో మన వాటా అంత అడిగేందుకు అవకాశం ఉంటుందని బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవిలు ప్రసంగించారు.బీసీలు చైతన్యవంతం కావాలని, ఎన్నో ఏళ్లుగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్నామని ఇప్పుడు పరిస్థితులు బీసీ వాదానికి అనుకూలంగా ఉన్నాయని, ఐక్యమత్యంతో పోరాడి అధికారాన్ని సాధించుకోవాలని చిరంజీవులు అన్నారు.. ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు రాజ్యాధికారమే దోహదపడుతుందన్నారు..
ఈడబ్ల్యూఎస్ పేరుతో నాలుగు శాతం లేని వాళ్ళు 10% రిజర్వేషన్ పొందుతున్నారని ఎస్సీ, ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తున్నారని, కానీ బీసీలకు మాత్రం 27% అమలు చేస్తూ మోసం చేస్తున్నారన్నారు..
తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు గడిచిన సామాజిక తెలంగాణకు ఇంకా దూరంగానే ఉన్నామని, బీసీలలో నాయకత్వ లక్షణాలున్న లీడర్లు పుట్టుకొస్తున్నారని, భవిష్యత్తులో అధికార దిశగా అడుగులు వేయాలని చిరంజీవులు కోరారు..
బీసీ వాదం తెలంగాణలో చాప కింద నీరులా ప్రవహిస్తుందని రాబోవు రెండు మూడు సంవత్సరాలలో తెలంగాణలో బీసీ వాదం కింద పలు బీసీ పార్టీలు వచ్చే అవకాశం లేకపోలేదన్నారు.
గతంలో బీసీలలో కొంత నాయకత్వ లోపాలు ఉండేవని ఇప్పుడు కొత్తతరం యువ నాయకత్వం ముందుకొస్తుందని భవిష్యత్తులో బీసీలదే అధికారమన్నారు..తెలంగాణలో అన్ని వాదాలు ఉన్నాయని కానీ బీసీ వాదం మాత్రం లేదని ప్రసంగిస్తూ 134 కులాలతో బీసీ సమూహం ఉంది కాబట్టి మనమందరం ఒకటే కులం అని అది బీసీ కులం అని అన్నారు..బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ మాట్లాడుతూ బీసీలందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో పోరాడితేనే రాజ్యాధికారం సాధ్యమని అందుకు ప్రతి ఒక్కరు బిసి భావజాల వ్యాప్తినీ సమాజంలోకి తీసుకెళ్లాలన్నారు..
సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో బీసీలు చాలా అన్యాయానికి గురవుతున్నారని, భవిష్యత్తులో బీసీలు అధికార దిశగా అడుగులు వేయాలని అప్పుడే ఉన్నత ఉద్యోగాల్లో సరియైన న్యాయం దక్కుతుందని, వడ్డించేవాడు ఉంటే ఎక్కడ ఉన్న న్యాయం జరుగుతుందని బీసీ సదస్సు కి ప్రత్యేక అతిథి గా వచ్చిన రవికుమార్ ప్రజాపతి అన్నారు…సభాధ్యక్షులు బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు మాట్లాడుతూ బీసీలు ప్రశ్నిస్తే ,మాట్లాడితే అవి తిట్లుగా భావిస్తున్నారని, భవిష్యత్తులో వచ్చేది బీసీల రాజ్యమే అని అన్నారు..
ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎం. శ్రీనివాస్ సాగర్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్, జాండ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్, బీసీ జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న ముదిరాజ్, స్వాతంత్ర సమరయోధుడు వకీల్ భీమయ్య, సీనియర్ న్యాయవాది బెక్కం జనార్ధన్, లక్ష్మణ్ గౌడ్, రమేష్ గౌడ్, శివాని, శివలీల, బాలమని తదితరులు పాల్గొన్నారు…

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి