Breaking News

జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి

చైతన్యవంతమైన కథనాలను రాయాలి

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్..

మన ప్రగతి న్యూస్/నర్సంపేట

నర్సంపేటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథసంచలన్

నర్సంపేట పట్టణంలోని కేఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్ లో టీడబ్ల్యూజేఎఫ్ నర్సంపేట నియోజకవర్గ స్థాయి జిల్లా ఉపాధ్యక్షులు కిషన్, కొమ్ము రాజు ల అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్ మాట్లాడుతూ జర్నలిస్టులు తమ వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తున్న క్రమంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజల పక్షాన, అనేక సమస్యలను, అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చే క్రమంలో దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
జర్నలిస్టులపై దాడుల నియంత్రణ రక్షణ కల్పించేందుకు గతంలో అటాక్స్ కమిటీ ఉండేదన్నారు. ప్రభుత్వం తిరిగి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అటాక్స్ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులు నియమ నిబంధనల మేరకు పని చేయాలని, ఏదైనా విషయం సోషల్ మీడియాలో వేగంగా ప్రచారం అవకాశం ఉన్నందున నిర్ధారించుకున్నకే వార్తలు రాయాలన్నారు.
సమాజంలోని సమస్యలను అధ్యయనం చేసి వార్తలు రాయాలని సూచించారు. జర్నలిస్టులు నైతిక నియమాలు, సూత్రాలను పాటించాలన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొంటూ వృత్తికి వన్నె తీసుకరావాలని సూచించారు. టీడబ్ల్యూజే ఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు రంగంలో మరింత పరిపూర్ణత సాధించడానికి వృత్తి శిక్షణ తరగతులను నిర్వహించాలన్నారు. సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నిరుపేద విద్యార్థులు చదువులకు దూరమౌవుతున్నారని, వారికి ఆర్థిక సహకారం అందించడానికి ఫెడరేషన్ నాయకత్వం కృషి చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషించిన జర్నలిస్టులకు కిందటి కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదన్నారు. ప్రధానంగా ఇండ్లు, ఇండ్ల స్థలాలు అంటూ ఆశచూపి చేయిచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క జర్నలిస్టు సొసైటీకి కుడా స్థలం ఇవ్వలేదన్నారు. గతంలో ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపుపై కోర్టులో కేసు కొనసాగుతుందని అన్నారు. జర్నలిస్టుల ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ వేసి అధ్యయనం చేయాలన్నారు. తద్వారా జర్నలిస్టులకు నివేశన స్థలాలు కేటాయింపు పై ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకురావాల్సిన అవుసరం ఉందన్నారు. అక్రిడిడేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం జాప్యం వీడి అర్హులైన జర్నలిస్టులందరికీ అందజేయాలన్నారు. ఇప్పటికే ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని తెలిపారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చిక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ వైద్య సదుపాయం కల్పించాలన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు పొడేటి అశోక్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి చిలువేరు శ్రీకాంత్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గ అడ్ హక్ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్ గా కుంటమల్ల అరవింద్, కో కన్వీనర్లుగా వళ్లాజీ సురేష్, కల్లెపు ప్రణీత్, బాధావత్ రవి, భూక్య వెంకట్, దోనాల రమేష్, ఇంగోలి అశోక్ రావు, ఈదుల కృష్ణ, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమం లో టీ డబ్ల్యూ జే ఎఫ్ జిల్లా నాయకులు జినుకల రజినికుమార్, కొండపర్తి చంద్రమోహన్, కల్లెపు వెంకటేశ్వర్లు, వివిధ మండలాల రిపోర్టర్ లు తదితరులు పాల్గొన్నారు.