మన ప్రగతి న్యూస్/ గూడూరు
గూడూరు మండలంలో ఘనంగా దసరా ఉత్సవ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆర్థికపరంగా సహకారం అందించిన బుడిగే సతీష్ గౌడ్ ను సన్మానించిన దసరా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం గూడూరులో దసరా ఉత్సవాలు దాతల సహకారంతో ఘనంగా జరుపుకుంటున్నామని గూడూరు మండల ప్రజలు తెలియజేశారు. భారీ బందోబస్తు నడుమ గూడూరు ఎస్సై దగ్గరుండి ఎలాంటి అవాంఛనీలకు గురికాకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు వహించారు. బుడిగె సతీష్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ మా మండలంలో ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని ఆయన తెలియజేశారు. ప్రతి ఏటా గూడూరులో దసరా సందర్భంగా రావణాసురుని వదని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే విజయవంతం చేశారు.
