Breaking News

అట్టహాసంగా బతుకమ్మ వేడుకలు

పిల్లలు పెద్దలు అందరు కలిసి సంతోషంగా జరుపుకున్న వేడుక

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్

నర్సంపేటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథసంచలన్

పిల్లలు పెద్దలు కలిసి సద్దుల బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఉదయం నుండి తీరొక్క పూలను సేకరించి శుషి శుభ్రతతో తలంటు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని బతుకమ్మలను పేర్చి, గౌరమ్మకు నైవేద్యంగా పిండి వంటలు చేసి సాయంత్రం బస్తీలోని వాళ్ళందరూ ఒక దగ్గర చేరి లైట్లు ఏర్పాటు చేసుకొని బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. మహిళలకు ఎంతో ఇష్టమైన ఈ పండుగ బతుకమ్మ పాటలు పాడుతూ కోలాట నృత్యాలు చేస్తూ డిజె సాంగ్స్ తో ఉయ్యాల ఉయ్యాలో బతుకమ్మ మళ్లీ తిరిగి రావమ్మ బతుకమ్మ అంటూ, మా తల్లి మమ్మల్ని సంతోషంగా చూడమ్మా అంటూ నువ్వు పడ్డ కష్టాలు మాకు వద్దమ్మా అంటూ ఆనందంగా జరుపుకున్నారు. తల్లి గారి ఇంటికి వచ్చిన కూతుర్లు ఇంటిల్లిపాది అందరు కలిసి సంతోషంగా ఘనంగా వేడుకలు చేసుకున్నారు. బతుకమ్మ వేడుక అనంతరం బతుకమ్మలను తీసుకెళ్లి దగ్గర్లోని చెరువులో నిమజ్జనం చేశారు. పెళ్లయిన మహిళలు తమ సౌభాగ్యాలను కాపాడాలని అష్టైశ్వర్యాలను ప్రసాదించాలంటూ,వేడుకుంటే పెళ్లి కాని యువతులు తమకు చక్కటి వరుడు దొరకాలని గౌరమ్మను మనసారా కోరుకున్నారు. ఈ సద్దుల బతుకమ్మకు కరుణించి మహిళలకు సహకరించిన వరుణుడికి మహిళలంతా కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఏకలాటిగా వర్షాలు కురుస్తూ ప్రజలను ఇబ్బందుల గురి చేసిన వరుణుడు మాత్రం సద్దుల బతుకమ్మ రోజు శాంతించడం మహిళలకు ఆనందం వేసింది.