మన ప్రగతి న్యూస్/ దోమలగూడ
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సద్దుల బతుకమ్మ వేడుకలను దోమలగూడలో ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి తమ జీవితాలు రంగులమయం కావాలని, సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో సౌభాగ్యంగా వర్ధిల్లాలని కోరుకుంటూ మహిళలు బతుకమ్మను ఆటపాటలతో కోలాట నృత్యాలతో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ పోయిరావమ్మ అంటూ చెరువులో నిమజ్జనం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం సద్దుల బతుకమ్మ రోజు వరుణుడు సహకారంతో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయని మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.చిన్న, పెద్ద,ముసలి ముతక వయసు తారతమ్యం లేకుండా అందరు కలిసి బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు.

