మద్యం మత్తులో భక్తుడి హంగామా.. ముగ్గురు కస్టడీ
మన ప్రగతి న్యూస్/ వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పోలీస్ కానిస్టేబుల్‌పై ఓ భక్తుడు దాడికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. మంగళవారం రాత్రి జాతర గ్రౌండ్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ భక్తుడిని విచారించగా, అతిగా మద్యం సేవించి ఉన్న సదరు వ్యక్తి బ్లూ కోట్ పోలీస్‌పై చేయి చేసుకున్నాడు.ఈ ఘటనలో దాడికి పాల్పడ్డ వ్యక్తితో పాటు మరో ఇద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

