Breaking News

వేములవాడలో పోలీసుల విధులకు ఆటంకం – ముగ్గురు అరెస్ట్

మన ప్రగతి న్యూస్ /వేములవాడ:

మంగళవారం రాత్రి వేములవాడ టౌన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్, రాహుల్, సుమన్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.ప్రజల శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని రాత్రి వేళల్లో అనవసరంగా గుమిగూడటం, బైక్‌లపై అతి వేగంగా తిరగడం, గందరగోళం సృష్టించడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఈ సందర్భంగా వేములవాడ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీరప్రసాద్ మాట్లాడుతూ, చట్టాన్ని గౌరవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు